జనంతో టీ నిర్వహించిన గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ లో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి జనంతో టీ జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను గాజు గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి జనంతో టీ జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండలం వైస్ ప్రెసిడెంట్ గడ్డం లక్ష్మిపతి, జనరల్ సెక్రటరీ గండికోట లోకేష్, నగేష్, నాగ, మోహన, కుమార్, లవన్న, శంకర, వేణు తదితరులు పాల్గొన్నారు.