అంగన్వాడి వర్కర్స్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అక్కల రామ్మోహన్

మైలవరం: స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ న్యాయబద్ధమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ మోహన్ రెడ్డి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చాడని, నేడు ఆ హామీలన్నీ తుంగలో తొక్కుతున్నాడని! విమర్శించారు. తెలంగాణ అంగన్వాడీలకంటే వెయ్యి రూపాయల జీతం అదనంగా ఇస్తానని, నమ్మించి ఓట్లు వేయించుకొని అంగన్వాడీలను మరియు హెల్పర్స్ ని నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. ఇకపై అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ ఆలోచించి ఓటు వేయాలని, న్యాయబద్ధమైన మీ డిమాండ్లను జనసేన మరియు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నెరవేర్చే విధంగా, మా పార్టీ అధినాయకత్వానికి తెలియపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రటరీ చింతల లక్ష్మీ కుమారి, జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, మైలవరం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు తాత పోతురాజు, కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్, సిఐటియు నాయకులు చాట్ల సుధాకర్, మహేష్, సిపిఎం నాయకులు ఆంజనేయులు, జనసైనికులు కూసుమంచి కిరణ్ కుమార్, ఆనం విజయకుమార్, కాంచన పాండురంగారావు, రవితేజ, మల్లారపు దుర్గాప్రసాద్, శీలం చందు, సాయి, పసుపులేటి నాగరాజు, బాలబోలు వెంకటనారాయణ, నీలి రాంబాబు, కడియం సౌరిబాబు తదితరులు పాల్గొన్నారు.