పుంగనూరు, రంజాన్ పర్వదినం సందర్భంగా చదళ్ల పరిసర ప్రాంతాలలోని 1000 ముస్లిం కుటుంబాలకు జనసేన నేత ఎన్విఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి రంజాన్ తోఫా అందజేశారు. చౌడేశ్వరిదేవి కళా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, మతాలు వేరైనా అందరినీ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని అన్నారు. సమాజంలో పేదలు ఆర్తులకు చేయూతను అందించేందుకు తను ఎప్పుడు ముందుంటానని స్పష్టం చేశారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో పుంగనూరు నియోజకవర్గంలో పేదల సంక్షేమ కార్యక్రమాలు రైతు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు అవసరమైన నిత్యావసర సరుకులు కిట్లను తన చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివ కుమార్ రెడ్డి, చైతన్య రాయల్, నరేంద్ర రెడ్డి, నారయణ రెడ్డి, విరూపాక్ష, జయపాల్ రెడ్డి, నరేష్ రాయల్, రాయల్ కుమార్, వికాస్, హరి, సబ్బు, హరి నాయక్, బాలాజీ నాయక్ మైనార్టీ సోదరులు కాలేష, సద్దు, సలీం, నజీర్, ఇస్మాయిల్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment