రంజాన్ తోఫా పంపిణీ చేసిన బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం లోని పొదలకూరు మండలంలో రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 12 గంటల పాటు ఉపవాసం ఉండి నియమనిష్ఠలతో మూడు పూటలా నమాజ్ చేస్తూ అబద్ధం చెప్పకుండా నోట్లోని లాలాజలం కూడా మింగకుండా ఎంతో పవిత్రంగా ఈ మాసం మొత్తం ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ముస్లింలకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ముస్లింలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వారికి అండగా ఉంటానని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పడం అదేవిధంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం వాళ్ళ మసీదులో అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటనే నిలబెట్టుకునే విధంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి మనస్పూర్తిగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని నాయుడు పొదలకూరు మండల నాయకులు నారదాసు రవి మధు సందూరి శ్రీహరి మనోజ్, ప్రసాద్, గిరిష్, తెలుగుదేశం పార్టీ నాయకులు జమీర్, మంజూర్, బాషా, శుభన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment