మరో మల్టీస్టారర్ మూవీలో రానా?

ఇటీవల టాలీవుడ్ లో మల్టీస్టారర్ హవా నడుస్తుంది. ఇప్పటికీ దగ్గుబాటి రానా ప్రభాస్ తో బాహుబలి సినిమా చేశాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. అలాగే బాబాయ్ వెంకీ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా తాజాగా మరో మల్టీ స్టారర్ కు రానా ఓకే చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు హీరోలు చేరిపోయారు. ఒకరు రానా అయితే మరొకరు శర్వానంద్. ఈ ఇద్దరి కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకూ స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తూ, మైత్రీ కళ్లలో పడిన ఒక యువకుడు, ఈ సినిమాను రూపొందించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు.