“సౌత్ బే” పేరుతొ యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించిన రానా

స్టార్ హీరో దగ్గుబాటి రానా తాజాగా యూట్యూబ్ ఛానెల్  ను స్టార్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్స్‌ మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీలు సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో హీరో రానా దగ్గుబాటి ఓ సొంత యూ ట్యూబ్‌ ఛానెల్‌ను స్టార్ట్‌ చేశారు. తన యూ ట్యూబ్‌ ఛానెల్‌కు సౌత్ బే అనే పేరు పెట్టారు రానా. పలు భాషల్లో కంటెంట్‌ను ఈ యూట్యూబ్‌ ఛానెల్‌లో చూడొచ్చు. పది సెకన్ల నుండి పది గంటల నిడివితో పలు భాషలకు సంబంధించిన కథలు ఇందులో అందుబాటులో ఉంటాయి. టాలెంట్‌ ఉండి కంటెంట్‌ జనరేట్‌ చేయాలనుకునే వారికి తగు అవకాశాలను ఈ ఛానెల్‌లో కలిగించబోతున్నారు రానా. ఇందులో కేవలం కథలే కాకుండా న్యూస్‌, యానిమేషన్‌, ఫిక్షన్‌ అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఉంటుందట.