‘భీమ్లా నాయక్’ నుంచి రానున్న రానా టీజర్!

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ‘భీమ్లా నాయక్’ సినిమా రూపొందుతోంది. కొంతకాలం క్రితం మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి ఇది రీమేక్. రానా కూడా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కు .. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో రానా పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఒక టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో రానా టీజర్ ఉండొచ్చని అంటున్నారు. ఈ టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.