రాంగ్ గోపాల్ వర్మ’ టైటిల్ లోగో విడుదల

సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు.

వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహా తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.