‘రంగ్‌దే’ కొత్త పోస్టర్

నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా, వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘రంగ్‌దే’. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా రంగ్‌ దే నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందులో కీర్తి, నితిన్‌ నవ్వుతూ కనిపించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రంగ్‌దే ప్రేక్షకుల ముందుకు రానుంది.