‘రంగ్‌దే’ సంక్రాంతి శుభాకాంక్షల పోస్టర్‌

యంగ్ హీరో నితిన్ మహానటి కీర్తీ సురేష్ జంటగా నటించిన సినిమా రంగ్‌దే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను లాక్‌డౌన్ తరువాత కూడా ఎంతో ప్రణాళికా బద్దంగా పూర్తి చేశారు. ఈ సినిమా వెంకి దర్శకత్వం వహించాడు. దీనిని సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇప్పుడు తన ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. అయనప్పటికీ పండుగ సంర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో నితిన్, హీరోయిన్ కీర్తీ ఇద్దరూ కూడా భారతీయ సంప్రదాయాన్ని కల్లకు కట్టినట్లు చూపుతున్నారు. సంక్రాంతి పండుగ సందడి మొత్తం వారిలోనే కనిపిస్తోంది. భీష్మా వంటి బ్లాక్ బస్టర్ తరువాత నితిన్ తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వేసవి బహుమతిగా మార్చి 26న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నితిన్ అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.