అనాధ పిల్లల మద్య రావుల సాయి కృష్ణ జన్మదిన వేడుకలు

  • అనధ పిల్లల మద్య జనసేన ఉమ్మడి కరీంనగర్ రామగుండం నియోజకవర్గం నాయకులు రావుల సాయి కృష్ణ జన్మదిన వేడుకలు

రామగుండం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రామగుండం నియోజకవర్గం నాయకులు రావుల సాయి కృష్ణ తన జన్మదిన వేడుకలు 54 అనాధ పిల్లల ఉండే తబితా బాలల సంరక్షణగా సంస్థలో కేక్ కట్ చేసి పిల్లలకు భోజనం పెట్టి, పండ్లు మరియు నిత్యవసర సరుకులు ఇచ్చి గనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రావుల సాయి కృష్ణ మాట్లాడుతూ.. తన పుట్టిన రోజు అనధ పిల్లల మద్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని రామగుండం నియోజకవర్గంలోని యువత తమ పుట్టిన రోజును తబితా బాలల సంరక్షణ సంస్థలో జరుపుకొని అనాధ పిల్లల ఆకలి తీర్చాలని కోరారు.