ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో రాస్తారోకో

ఇచ్చాపురంలో ఉన్న సిహెచ్సిలో సరియైన వైద్య సేవలు అందడం లేదని చాలా మంది జనసైనికుల దగ్గర చెప్పగా శుక్రవారం ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు మరియు జనసేన నాయకులు వెళ్లారు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఉన్న అల్ట్రా స్కానింగ్, పనిచేయని ఈసిజి మెషిన్ మరియు రక్త పరీక్షలు చేయడానికి కనీసం కెమికల్స్ కూడా లేని పరిస్థితి. రక్త నిల్వ మరియు స్టోరేజ్ ఎక్విప్మెంట్ సుమారుగా 11 నెలలుగా పనిచేయడం లేదు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 6 గురు డాక్టర్స్ పనిచేయవలసిన దగ్గర కేవలం ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళమీద పనిఒత్తిడి పడుతుంది. 300 ఓపి ఉన్న హాస్పిటల్ ఈరోజు కేవలం 40 ఓపి ఉంది. ఏ చిన్న బాగులేకపోయిన రిఫర్ చేస్తున్నారు గాని ఇక్కడ ట్రీట్మెంట్ అవడం లేదు. ఇక్కడ ఏ డాక్టర్ కూడా పనిచేయరు. ప్రైవేటుగా ప్రాక్టీసు చేసుకుంటూ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఉన్నారు. ప్రజాధనము వృధా చేస్తున్నారు. ఈ హాస్పిటల్ ని ఇంత వరకు డిసిహెచెస్ కూడా తనిఖీలు చేయలేదు. ఇక్కడ పరిస్థితిలో మార్పు రానందున శనివారం జనసేన తరుపున రాస్తారోకో మరియు రోడ్లపై బైఠాయించబడునని తెలియజేసారు.