జనసేన తీర్ధం పుచ్చుకున్న కోడెబోయిన రవిపటేల్‌

భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లా సామాజిక న్యాయవేదిక అధ్యక్షుడు కోడెబోయిన రవిపటేల్‌ తన పదవికి రాజీనామా చేసి ఆదివారం బూర్ఘంపహడ్‌ మండలం సారపాకలో కొసనా అంకబాబు ఆధ్వర్యంలో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సంధర్బాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్‌ నిజాయితీ నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవిందు వెంకటేశ్వర్లు, జాదవుల కనకయ్య, వెలిశెట్టి చంద్ర, చెలికాని శశి, బద్రి తదితరులు పాల్గొన్నారు.