వార్ వన్ సైడ్ చేసిన రవితేజ ‘క్రాక్’…

సంక్రాంతి బరిలో అసలైన మాస్ హిట్ అందుకున్న చిత్రం క్రాక్. గత కొంతకాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ రాజా ర‌వితేజ కు అసలైన హిట్ ఇచ్చి ఆయనకు ఊపిరి పోసింది. డాన్ శ్రీను , బలుపు చిత్రాలతో సూపర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మరోసారి రవితేజ కు అంతమించి హిట్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను కాస్త ముందు గానే మొదలు పెట్టి అది కూడా ఈ ప్యాండమిక్ టైం లో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకొని స్యూర్ షాట్ హిట్ గా నిలిచింది.

మరి ఆడియెన్స్ పల్స్ ప్రకారం చూస్తే కనుక మాస్ మహారాజ్ ఈ సంక్రాంతి పందాన్ని వార్ వన్ సైడ్ చేసాడనే చెప్తున్నారు. కేవలం బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలు మాత్రమే కాకుండా అనుకున్న అంచనాలను రీచ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కావడం అనేది ఇప్పుడున్న సినిమాల్లో ఇదొక్కటే చేసింది. అలా ఈ చిత్రం సంక్రాంతి రేస్ లో వార్ వన్ సైడ్ చేసేసింది అని చెప్పొచ్చు…