సంక్రాంతి రేసులో రవితేజ ‘క్రాక్’

మాస్ మహారాజ రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యి చాల రోజులే అయినా కరోనా కారణంగా రిలీజ్ కి నోచుకోలేదు.. దాంతో థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది. దీనికి ముందు రవితేజ హిట్ కొట్టి చాలా రోజులైపోయింది.. అయన చేసిన అరడజను సినిమాలు భారీ పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు..

రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు సరైన హిట్ లేదు.  ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని డాన్ శీను, బలుపు వంటి హిట్ సినిమాలను అందించిన గోపీచంద్ మలినేని తో చేతులు కలిపాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాగా ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికే దర్శక నిర్మాతలు మొగ్గు చూపారట..

థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి కనుక కొత్త సినిమాలు కూడా మెల్ల మెల్లగా విడుదల అవుతున్నాయి. నేడు రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సంక్రాంతి వరకు పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో క్రాక్ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.