రవితేజ క్రాక్ సినిమా విడుదల డేట్

సంక్రాంతి అంటే తెలుగు సినిమాకు పండగ సీజన్. గత కొన్నేళ్లుగా ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పండక్కి ఆ స్కోప్ కూడా కనిపిస్తుంది. అయితే అప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. కరోనా కారణంగా 2020లో రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ సంక్రాంతికి రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం క్రాక్ థియేటర్లలో అలరించనుంది.

గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం క్రాక్ విడుదలకు సిద్దం అయింది, తాజాగా ఈ సినిమా ఎప్పుడు వచ్చేది ప్రకటించారు చిత్ర యూనిట్.. 2021 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

ఇక త్వరలో ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు… ఈ విషయం దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు. వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను బలుపు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి, దీంతో ఈసినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.