రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన రాయచోటి జనసేన

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో రాయచోటి అసెంబ్లీ ఇంచార్జ్ షేక్ హసన్ బాషా మరియు జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్ ముస్లిం మత పెద్దలు ఆరిఫ్, మహ్మద్, జనసైనికులు, మిత్రులతో కలిసి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రంజాన్ పురస్కరించుకుని సమాజంలో అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎటువంటి బేధాలు లేకుండా పూర్వకాలం నుంచి వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను గౌరవించుకోవడం అన్నది మన సమాజానికి చాలా అవసరమని ప్రజలందరికీ పిలుపునిస్తూ ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.