రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని.. ఎపికి ఆదేశాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ను కృష్ణా బోర్డు ఆదేశించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌) సమర్పించి, ఆమోదం పొందిన తర్వాతే పనులు చేపట్టాలని బోర్డు తరుఫున సభ్యుడు హెచ్‌కె మీనా ఎపి జనవనరుల కార్యదర్శికి లేఖ రాశారు. ఎత్తిపోతల పథకం పనులను సజావుగా సాగుతున్నాయా లేదా అనేది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదించాలని కఅష్ణా బోర్డు నిపుణుల కమిటీని ట్రైబ్యునల్‌ ఆదేశించిందని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. నిపుణుల కమిటీ పర్యటనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకాశమివ్వలేదని, తాజాగా ఈ ప్రాజెక్టు పనులపై తెలంగాణ కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. డిపిఆర్‌ను సమర్పించి, ఆమోదం పొందిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టాలని తెలిపారు.