దిబ్బపాలెం గ్రామ యువతకు క్రికెట్ కిట్ అందించిన రాయపరెడ్డి

మాడుగుల నియోజకవర్గం: చీడికాడ మండలం, దిబ్బపాలెం గ్రామ యువతకు మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ ఒక క్రికెట్ కిట్ ను రాము, శివ, తులసీరామ్ చేతుల మీదుగా గ్రామ యువతకు అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి గ్రామానికి క్రికెట్ కిట్ అందించినందుకు గాను దెబ్బపాలెం గ్రామ జనసైనికులు రాయపరెడ్డి కృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిబ్బపాలెం గణేష్, రాము, శివ, తులసి రాం, చెర్రీ, రాజేష్ గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.