శ్రీ పైడితల్లమ్మ దేవాలయ నిర్మాణానికి రాయపురెడ్డి కృష్ణ విరాళం

మాడుగుల, దేవరపల్లి మండలం, కొత్తూరు ముత్యాలమ్మపాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ పర్యటించడం జరిగింది. గ్రామస్తులు రాయపరెడ్డి కృష్ణని, గొర్రెపోటు రామ్మూర్తి నాయుడుని స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి దేవాలయం నిర్మాణం కొరకు విరాళంగా రూ.10,116/- చెక్కును దేవరపల్లి మండలం జనసేన నాయకులు, గ్రామస్తుల సమక్షంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకి అందజేశారు. ఈ సమయంలో గ్రామస్తులు తమ గ్రామానికి గల మంచినీటి సమస్యను రాయపురెడ్డి కృష్ణకి తెలియజేశారు. ఆయన తక్షణమే ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని గ్రామస్తులకు తెలియజేశారు.