రాయపురెడ్డి కృష్ణ రూపాయలు 10,000/- ఆర్థికసాయం

మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలం అడవుల అగ్రహారం గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు కమ్యూనిటీ హాల్ ముందు రేకులు వేయటానికి జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ రూపాయలు 10,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగ్రామ జనసైనికులు, భవాని భక్తులు పాల్గొని రాయపురెడ్డి కృష్ణ(ఆర్.ఆర్.కె)ని శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని రాయపురెడ్డి కృష్ణ(ఆర్.ఆర్.కె) తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.