రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.19-7-21,సోమవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాజోలు మండలం రాజోలు గ్రామానికీ చెందిన  దేవళ్ళ సుబ్బారావు గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో దారపురెడ్డి బాబ్జి గారిని సంప్రదించగా…. బాబ్జి గారు రాజోలు ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో దేవళ్ళ సుబ్బారావు గారి సంబంధిత బంధువులకు సోమవారం ఆక్సిజన్ సిలెండర్ ను అందించడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife