మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్లాస్మా దాతను సత్కరించిన రాజోలు చిరుపవన్ సేవాసమితి

మెగాస్టార్ చిరంజీవిగారి పుట్టినరోజు వారోత్సవాల లో భాగంగా ఈరోజు రాజోలు తాలూకా చిరుపవన్ సేవాసమితి గుండాబత్తుల తాతాజీగారి పర్యవేక్షణ లో మెగా అభిమానులు, జనసైనికులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రారంభించారు…

 చిరంజీవి గారి పిలుపు మేరకు రాజోలు తాలుకా లో మొదటి ప్లాస్మా దాత జనసైనికుడు మేడిచర్ల రాజశేఖర్ ను జననాయకులు కోళ్ళ బాబి ఆద్వరంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ జి.ప్రభకర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆచారి, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, సన్మానించారు ఈ కార్యక్రమంలో పినిశెట్టి బుజ్జి, ఉండపల్లి అంజి, ఉలిశెట్టి లక్ష్మణరావు, తులా అది, చింతా ప్రసాద్, పైడిపర్తి రాజా, ఇంటిపల్లి ఆనందరాజు, ముత్యాల నరేష్, నాయుడు కృష్ణ, బళ్ళ చరణ్, మంగళంపల్లి గద, నిమ్మకాయల నాయుడు, సూర్య, రామకృష్ణ, సురేష్, నితీష్, సత్తిబాబు, నారాయణ, సూరిబాబు, మెగాఅభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.