Razole: భక్తుల కోసం రాజోలు జనసేన నాయకుడు సాధనాల వెంకన్న బాబు

కార్తీకమాసం శివ భక్తులకు అతి పవిత్రమైనది. రాజోలు శివ భక్తులు కార్తీకమాసంలో గోదావరి నదీ తీరంలో స్నానమచరించి శివుని పూజిస్తారు. అయితే కార్తీకమాసం ప్రారంభం కావడంతో మొదటి సోమవారం సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని రాజోలు ఎటిగట్టు స్నానాల రేవు దగ్గర మరియు శివాలయం రోడ్డులో జనసేన నాయకులు శ్రీ సాధనాల వెంకన్నబాబు సొంత ఖర్చుతో బ్లీచింగ్ జల్లించారు. కరోనా కాలంలో శ్రీ సాధనాల వెంకన్నబాబు చొరవ తీసుకుని బ్లీచింగ్ చల్లించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు.