*ఆర్డీఎస్ ప్రసాద్
కోనసీమ యువతలో సమాజసేవ పట్ల ఆసక్తి పెంచిన ఆర్.డి.ఎస్. ప్రసాద్ సేవా మార్గంలో మరో మెట్టు ఎక్కారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా కాకుండా, టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ఒక స్వచ్ఛంద సంస్థగా తీర్చిదిద్దిన ఆయన, గత రెండు దశాబ్దాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, వరద సహాయం, కరోనా సమయంలో ఔషధ పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవలకు గుర్తింపుగా 2022లో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అమలాపురం శాఖకు సభ్యునిగా చేర్చబడి, క్లబ్ సెక్రటరీగా, విభిన్న విభాగాల చైర్మన్‌గా నిర్వర్తించిన పాత్రకు ప్రశంసలొచ్చాయి. ఫలితంగా 2025–2026 సంవత్సరానికి ఆయనను క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు నల్లా శ్రీధర్ తో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సంఘ సభ్యులు ఆయనకు హార్దిక అభినందనలు తెలిపారు.
Share this content:
Post Comment