నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ: మంచు మనోజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు  సందర్భంగా మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్‌ కి కాస్త స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఈ మేరకు తన స్నేహితుడి తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ గా ఉన్నానని చెప్పాడు. 1982 లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన సూపర్ హిట్ మల్టీస్టారర్ `బిల్లా రంగా` మూవీ అక్టోబర్ 15తో 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

దీంతో సాయి ధరమ్ తేజ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇద్దరం కలిసి ఈ సినిమా రీమేక్ చేద్దామనే ప్రతిపాదన పెట్టాడు మనోజ్. ” ఓ వైపు నీ పుట్టినరోజు.  మరోవైపు బిల్లా రంగా సినిమా 38 సంవత్సరాలు పూర్తి. ఈ రెండూ కాకతాళీయమే అయినా. . ఇది మనకు ఏదో చెబుతోందని అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ. . నువ్వు రెడీయా” అని మనోజ్ ఇన్స్టా లో పోస్ట్ చేసాడు. మనోజ్ ట్వీట్ పై జనాలు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ”క్రేజీ కాంబినేషన్, సూపర్, మీ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలని కుతూహలంగా ఉంది, మేమూ రెడీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చూడాలి మరి మనోజ్ ప్రతిపాదనపై మెగా మేనల్లుడు ఎలా రియాక్ట్ అవుతాడనేది !. ఇకపోతే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.నిజంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ వస్తే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.