యువతకు భరోసా, రాష్ట్రానికి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ కే సాధ్యం

  • కోన తాతారావు పీఏసీ సభ్యులు, గాజువాక నియోజకవర్గం

గాజువాక నియోజకవర్గం: ఇంచార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ జివిఎంసి 79, 85, 86, 87, 88 వార్డులలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వివిధ వార్డుల్లో వున్న గ్రామాలు సందర్శించి వైసిపి ప్రభుత్వంలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, కొత్త పరిశ్రమలు రాక ఉపాధి లేక యువత ఎదుర్కొంటున్న కష్టాలతో పాటు వైసిపి నాయుకులు చేస్తున్న భూఆక్రమణలు, అరాసాకాలు, దౌర్జన్యాలు గూర్చి తెలుసుకున్నారు. ఈ రోజు ప్రజలు తెలియచేసిన వాటిలో ప్రధాన సమస్యలు ఉక్కు ప్రైవేటీకరణ, ఉక్కు నిర్వాసితుల ఉపాధి, ఫార్మ నిర్వాసితుల సమస్య, స్థానికులకు ఉపాధి కల్పన, మౌలిక వసతుల లేమి, ధరలు పెరుగుదల మొదలగు సమస్యలు తెలియజేసారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలన్నా, యువతకు భరోసా మరియు రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ తోటే సాధ్యమని, కోన తాతారావు అన్నారు. జనసేన, టిడిపి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకు ప్రజలతో జనసేన పార్టి శ్రేణులు మమేకమై వారికి అండగా ఉండాలనేది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ బైక్ ర్యాలీలో 2500 పైగా బైక్ లు, వేల సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడశాల అప్పారావు, తిప్పల రమణా రెడ్డి, వార్డు ఇంచార్జ్ లు గవర సోమశేఖర్ రావు, కాదా శ్రీను, మేడిశెట్టి విజయ్, సిరసపల్లి కనకరాజు, వబ్బిన జనార్దన్ శ్రీకాంత్, ఇందల వెంకటరమణ, కరణం కనకారావు, దుల్ల రామనాయుడు, బలిరెడ్డి నాగేశ్వరావు, రౌతు గోవింద్, కోన చిన అప్పారావు, గంధం వెంకట్రావు, గొలగాని గోపిచంద్, కొల్లి శివాజీ, గొలకోటి సోమన్న, సంరన భాస్కర్, సండ్రాన భాస్కర్, దాసరి త్రినాధ్, బలిరెడ్డి అరవింద్, శ్రీమతి ముమ్మన మురళీ దేవి, శ్రీమతి మాకా శాలిని, శ్రీమతి కరణం కళావతి ఇతర జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.