ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా రెడ్డి అప్పల నాయుడు..!

ఏలూరు, మార్చి 13,14,15 వ తేదీల్లో పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను పార్టీ అధిష్టానం సోమవారం నియమించింది. ఈ మేరకు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ & బోర్డు డైరెక్టర్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసెంబ్లీ ఇంచార్జీలు, పీవోసీలు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసే బాధ్యతలను రెడ్డి అప్పల నాయుడుకి అప్పగించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు తనకు ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరి ప్రసాద్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తూ.చా. తప్పకుండా నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని, ఈ సందర్భంగా పిఠాపురంలో జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేస్తామని తెలిపారు.

Share this content:

Post Comment