ప్రభుత్వానికి సవాల్ విసిరిన రెడ్డి అప్పల నాయుడు

  • రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి ఇంటిపన్ను విధించడం మీరు సాధించిన అభివృద్ధా?
  • విద్యుత్ స్లాబ్ లు పెంచి బిల్లు మోత మోగించడం మీరు సాధించిన అభివృద్ధా?
  • పెట్రోల్ డీజిల్ పై సెస్ విధించడం మీరు సాధించిన అభివృద్ధా?
  • ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డీలు విరగ్గొటడం మీరు సాధించిన అభివృద్ధా?
  • చెత్త మీద పన్ను వేసి చెత్తగా ఆలోచించడం మీరు సాధించిన అభివృద్ధా?
  • రాష్ట్రం నలుమూలన గుంతల రోడ్డులతో మీరు సాధించింది
    అభివృద్ధా?
  • అన్నింటినీ కన్న ముఖ్యమైన నిత్య అవసరాల ధరలు అధికంగా పెంచడం మీరు సాధించిన అభివృద్ధా?
  • 180 రోజులు కష్టపడి పండించిన రైతుల ఒడ్లు బకాయిలు తీర్చుకుండా ఇబ్బందులకు గురి చేయడం వారిని అధిక వడ్డీలకు అప్పుల పాలు చేయడం మీరు సాధించింది అభివృద్ధా?

ఏలూరు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అంటూ రెడ్డి అప్పల నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడిచిన గత మూడేళ్లలో మీరు మీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏముందని ప్లీనరీ సమావేశాలు నిర్వహించి సంబరాలు చేసుకుంటున్నారు అని ప్రభుత్వంపై పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పల నాయుడు ధ్వజమెత్తడం జరిగింది. ఏలూరు నియోజకవర్గంలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని వారి గోడు వినడానికి కనీసం అందుబాటులో లేకుండా ఉండే విధానం ఒక్క ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళనానికే చెందిందని కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండరని మంత్రి పదవి పోయిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత జిల్లా అధ్యక్షుడిగా అవతారం ఎత్తి ప్లీనరీ సమావేశాలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు. ఒక పక్కన ఏలూరు నియోజకవర్గం లో చెత్త చెదారంతో మురుగు డ్రైన్ లు నిండిపోయి చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి అని మరో పక్క మూడేళ్ళుగా టిడ్కో ఇళ్ళు వస్తాయని చూసి చూసి విసుగు చెంది అధిక వడ్డీలకు తెచ్చిన రుణాలను తీర్చలేక అదేవిధంగా శిధిలావస్థకు వస్తున్న టిడ్కో ఇళ్ళను చూసి ప్రజలు పడుతున్న బాధలను ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళనాని గార్కి కంటికి కనిపించడం లేదా అని రెడ్డి అప్పల నాయుడు మండి పడ్డారు. ఒక్కసారి ప్రతి గడపకు వెళ్తే ప్రజల ఏ విధంగా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారని మీకు తెలుస్తుంది. ఏలూరు నియోజకవర్గంలో మీ ఇంటికి అతి చేరువలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, డాక్టర్ లు, సిబ్బంది కొరతలు ఉన్నాయని మీకు తెలియదా ? అందులో మీరు సాధించిన అభివృద్ధి ఏముందని ప్లీనరీ సమావేశాలు నిర్వహించి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏదైనా సమస్య వాటిల్లుతుంది అంటే అది ఒక్క వైసీపీ ప్రభుత్వం వలనే అని అదేవిధంగా ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలనే అని ప్రజలు నమ్ముతున్నారు.
ఒక పక్క మూడు వేల పైచిలుకు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి తన సొంత కష్టార్జితం నుండి 30 కోట్ల రూపాయలను మరియు వారి పిల్లల భవిష్యత్తు ను తన భుజాల మీద వేసుకుని ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని ఇకనైనా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మాని ప్రజా సమస్యల పై దృష్టి సారించాలని రెడ్డి అప్పల నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.