డి.ఎస్.పి శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: నూతన డి.ఎస్.పిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఈ. శ్రీనివాసులు ను పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.