రైతులకు ఎరువుల బస్తాల పంపిణీ చేసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్థానిక చొదిమెళ్ళ గ్రామ రైతులకు ఎరువుల బస్తాల పంపిణీ చేసిన జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండి రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతు ఉంటే మరో పక్క రైతు వద్దనుండి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు జమ చేయకుండా కాలయాపన చేయడం వలన అధిక వడ్డీలు కట్టుకోలేక రైతులు అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితికి వచ్చారు. ఎన్నడూ లేని విధంగా నేడు కోనసీమలో రైతులందరూ క్రాప్ హాలీడే ప్రకటించడం ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెందింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాకీ పడ్డ రైతులకు వెంటనే నగదు జమ చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అనంతరం యడ్లపల్లి శివ కొండ, రాపోలు సత్యనారాయణ, అంకెం వెంకట రత్నం, నరహరిశెట్టి వెంకటేశ్వరరావు, నరహరిశెట్టి నాగేంద్ర, యడ్లపల్లి రమేష్ అనే రైతులకు ఎరువుల బస్తాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, మండల ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, వల్లూరి రమేష్, నిమ్మల శ్రీనివాసు, కృష్ణ మరియు స్థానిక నాయకులు యడ్లపల్లి రామాంజనేయులు, వాడవల్లి శ్రీనివాస్ రావు, పల్లగాని జానకి రామ్, బండి రామకృష్ణ, మధ్యాహ్నపు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.