కబ్జాకు గురౌతున్న కామన్ సైట్ ను పరిశీలించిన రెడ్డి అప్పల నాయుడు

  • నెహ్రూ నగర్ ఆముదాల అప్పలస్వామి కాలనీలో కబ్జాకు గురౌతున్న కామన్ సైట్ ను పరిశీలించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం లోని 15 వ డివిజన్ లో ఉన్న నెహ్రూ నగర్ ఆముదాల అప్పలస్వామి కాలనీ లో ఉన్న కామన్ సైట్ ని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడి స్థానిక ప్రజలు రెడ్డి అప్పల నాయుడు వద్ద మొరపెట్టుకున్నారు.. దీనిపై స్పందించిన రెడ్డి అప్పల నాయుడు ఆ స్థలాన్ని జనసేన నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరులో మీకు ఓట్లు వేసి మిమ్మల్ని తమ భుజాలపై మోసిన పాపాన ఆ డివిజన్ ప్రజలకు చేసిన ఘనకార్యం ఇదా అని ప్రశ్నించారు.. అలాగే ఈ స్థలం లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వాటిని అధికారులు అరికట్టాలని కోరారు.. ఈ స్థలం కబ్జాకు గురి అవకుండా చూడాల్సిన బాధ్యత ఏలూరు శాసనసభ్యుడు మేయర్ మున్సిపల్ కమిషనర్ వారికి పై ఉందని వారికి ఈ విధంగా గుర్తు చేస్తున్నామని అన్నారు.. అలాగే కొన్ని చోట్ల చెత్తాచెదారం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ స్థలాన్ని శుభ్రపరచాలని ఆయన కోరారు.. లేనిపక్షంలో జనసేన పార్టీకి తరపున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్థానిక మున్సిపల్ అధికారులను హెచ్చరించారు.. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థలంలో ఏదైనా దేవాలయాలు కానీ,పార్కు కానీ,కమ్యూనిటీ హాల్ కానీ,కళ్యాణ మండపం కానీ ప్రజలకు కావలసిన ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్మాణాలను కట్టి ఇస్తామని స్థానిక ప్రజలకు హామీని ఇచ్చారు..ఈ కార్యక్రమంలో పైడి లక్ష్మణరావు, నగిరెడ్డి కాశీ నరేష్, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ,వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్,బోండా రాము నాయుడు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, దోసపర్తి రాజు, బుధ్ధా నాగేశ్వరరావు, జనసేన రవి, బలరాం, తుమ్మపాల ఉమాదుర్గ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.