ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో 5వ డివిజన్ టీచర్స్ కాలనీ, చెంచుల కాలనీ, కళావతి కాలనీ, నేతాజీ నగర్ లో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన రాజకీయ దాహం కోసం అమాయకులను బలి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త డ్రామాకు తెర లేపారని కూటమి అభ్యర్థి బడేటి చంటి ఆరోపించారు. ఏలూరు నియోజకవర్గంలో టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర లక్ష్యసాధన దిశగా కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా ఐదవ డివిజన్ పరిధిలోని ఐబీఎం చర్చి వద్ద నుండి సంకల్పయాత్రను ప్రారంభించారు. ఈ సంకల్పయాత్రలో ముఖ్యఅతిథిగా రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలోని 5వ డివిజన్లో ఐబిఎం చర్చి దగ్గర నుండి ఈ సంకల్ప యాత్ర ప్రారంభమై కళావతి కాలనీ, నేతాజీ నగర్, ఇస్సాకు కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి బడేటి చంటి ఈ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ డివిజన్లో ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుంది. ఈ ఐదు సంవత్సరాలు మా రక్తాన్ని తాగారని, డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉందన్నారు. ఎక్కడ కూడా లైట్లు వీధి దీపాలు వేసిన దాఖలాలు లేవు. కొంతమందికి ఏవో కుంటి సాకులు చెప్పి పెన్షన్లను అన్యాయంగా పీకి వేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలో అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. అలాగే భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని ప్రజలంతా విన్నవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంత భావిస్తున్నారు. ఈ డివిజన్లో విశేష స్పందన వస్తుంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ప్రజా అణచివేతతో అందరూ విసుగు చెంది ఉన్నారు. ఇంటి పన్నులు, చెత్త పనులు, కరెంటు బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఉపాధి లేదు. నిత్యవసరకులు ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. నెలకివచ్చేసరికి అదనంగా నాలుగు అయిదు వేలు భారం పడుతుందని ప్రజలు మా వద్ద వాళ్ళ ఆవేదనను మాకు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బడేటి చంటి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నామని అన్నారు. మే 13వ తేదీ ఎంతో దూరంలో లేదని వాళ్లు మన ఓటు దొంగిలించడానికి దొంగల్లాగా ఎదురు చూస్తున్నారని మళ్లీ మన ఇళ్లల్లో పడతారని తస్మాస్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులతో పాటు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కుర్మా సరళ, కోశాధికారి పైడి లక్ష్మణరావు, మీడియా ఇంచార్జ్ జనసేన రవి, చిత్తరి శివ, కోలా శివ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి ప్రసాద్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, రండీ దుర్గాప్రసాద్, వంశీ, అరవింద్, బెజవాడ నాగభూషణం, అగ్గాల శ్రీనివాస్, వాసు నాయుడు, పవన్, వీరమహిళలు కొసనం ప్రమీల, గాయత్రి, గుదే నాగమణి, గిడుతూరి పద్మ భారీ సంఖ్యలో జనసేన తెలుగుదేశం బిజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.