సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: కైకలూరు నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కర్త సిఏ బి.వి.రావు ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుక పంపిణీలో రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్రాంతి మహోత్సవములో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కైకలూరు నియోజకవర్గంలో శుక్రవారం కైకలూరు జనసేన పార్టీ సమన్వయకర్త సిఏ బి.వి.రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల మహోత్సవములో భాగంగా నిరుపేదలకు 9 సరుకులతో కూడిన నిత్యావసర సరుకులను ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా పంచడం జరిగింది.