శ్రీ గంగానమ్మ అమ్మవారి అన్నసంతర్పణలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం 39వ డివిజన్ లోని శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో జరిగిన శ్రీ దేవీ నవరాత్రులు మహోత్సవముల సందర్భంగా ఆలయకమిటీ వారి ఆహ్వానం మేరకు శుక్రవారం అన్నసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిధిగ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం 6 వ డివిజన్ సుంకర వారి తోటకు చెందిన జనసేన పార్టీ నాయకులు పడాల కొండలరావు కుమారుడు పడాల రాజు నూతన కిరాణా షాపును పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు బొత్స మధు, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.