కంచి కామాక్షి మరియు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను కుటుంబ సమేతంగా దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు బుధవారం తమిళనాడు లోని కాంచీపురంలో స్వయంభూ వెలసిన కంచి కామాక్షి అమ్మవారిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తుందని, ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం అమ్మవారు మరియు స్వామి వారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Share this content:

Post Comment