తిరుపతి, ఎంతో ప్రసిద్ధి గాంచిన తిరుపతిలో వెలసిన కలియుగ దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తుందని, ఆ స్వామి వారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. అనంతరం శ్రీ స్వామి వారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేదపండితులు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం అందజేశారు.
Share this content:
Post Comment