ఆమరణ దీక్షకు స్వల్ప విరామం- రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున రెడ్డి అప్పలనాయుడు నిర్వహించబోయే ఆమరణ నిరాహార దీక్ష విషయం తెలుసుకుని పార్టీ పెద్దలు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్చార్జి పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస నీ పంపించడం జరిగింది. పార్టీ పెద్దలు ఆదేశించిన విధంగా రెడ్డి అప్పలనాయుడు గారికి తగు గౌరవం కల్పించే బాధ్యత నాది అని మీడియా సమావేశంలో బొలిశెట్టి శ్రీనివాస్ రెడ్డి అప్పల నాయుడు గారికి, ఏలూరు జనసేన నాయకులకు హామీ ఇచ్చారు.. అంతవరకు ఆమరణ నిరాహార దీక్షను రెడ్డి అప్పలనాయుడు తాత్కాలిక విరమణ ఇవ్వాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ పొత్తు ధర్మం పాటిస్తు అందులో భాగంగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుని మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేటాయించడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ పార్టీ అధిష్టానం నుండి ఎటువంటి పిలుపు రాలేదన్న మనస్తాపంతోనే నిరాహారదీక్ష కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు సూచించడంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు.. పార్టీ అదిష్టానం పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ ని పార్టీ తరఫున పంపించి హామీ ఇచ్చారు కావున స్వల్ప విరామం ఇవ్వాలని కోరారు వారిపై నమ్మకం ఉంచి ఈ ఆమరణ నిరాహార దీక్షని కొంతకాలం వాయిదా వేస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. ఒకవేళ పార్టీ నుంచి ఎటువంటి హామీ రాకపోతే నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడబోనని రెడ్డి అప్పలనాయుడు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. మీడియా సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల సమన్వయకర్త బీ.వి.రాఘవయ్య చౌదరి, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.