తొలి ఏకాదశి వేడుకలలో రెడ్డి అప్పలనాయుడు

*శ్రీ వాసవీ మాత, గంగానమ్మ అమ్మవార్లకు అమ్మవార్లకు విశేష పూజలు

ఏలూరు, ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అలాగే హిందువుల భక్తిశ్రద్ధలతో కూడిన గంగానమ్మ తల్లికి ఆశాఢ మాస తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ఏలూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని 50వ డివిజన్ వివి నగర్లోని శ్రీ గంగానమ్మ దేవాలయం, ఆదివారపుపేట గంగానమ్మ ఆలయం, పెరుగు చెట్టు వద్ద ఉన్న శ్రీ వాసవీ అమ్మవారి సత్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు భక్తిపూర్వకంగా ఆషాఢ సారె సమర్పించారు. ప్రత్యేకంగా శాకాంబరీ అలంకారంతో వాసవీ అమ్మవారిని అలంకరించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ “తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు పూజ కైంకర్యాలు నిర్వహించాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శశ్యశ్యామలంగా పాలించాలనే ఆశయంతో, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో మేము ఈ పూజలు నిర్వహించాం. గంగానమ్మ తల్లి, వాసవి మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలి” అని ఆకాంక్షించారు. వాసవీ మాత ఆలయ కమిటీ నిర్వహణలో మహోత్సవం అద్భుతంగా సాగిందని పేర్కొంటూ, ఆలయ కమిటీ సభ్యులు చుక్కా రాజారావు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, నంగులూరి సత్యనారాయణ, నున్న శ్రీనివాసరావు, మద్దుల పవన్ కుమార్, గంగానమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు, ఏలూరు నగర ప్రముఖులు, స్థానిక కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాతవారి ఆశీస్సులు పొందారు. జనసేన పార్టీ ప్రజల మతపరమైన, సాంస్కృతిక విశ్వాసాలకు ప్రాధాన్యం ఇస్తూ వారితో మమేకమై కొనసాగుతోందని ఈ కార్యక్రమం స్పష్టంగా చూపించింది.

Share this content:

Post Comment