- అంతరిక్ష రంగంలో సునీత విలియమ్స్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శం
- ఇద్దరు వ్యోమగాములు భూమిని సురక్షితంగా చేరుకోవడం ఆనందదాయకం
- స్త్రీ యొక్క సంకల్పశక్తి, అంకితభావాన్నీ చూసి ప్రపంచమే గర్విస్తుంది అని కొనియాడిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్న భారత్ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు శుభాభినందనలు తెలియజేశారు. ఇద్దరు వ్యోమగాములు భూమిని సురక్షితంగా చేరుకోవడం ఆనందాయకమని, ముఖ్యంగా భారత్ మూలాలు ఉన్న సునీత విలియమ్స్ సాధించిన ఈ విజయం మన దేశం అంతటికి గర్వకారణం అని పేర్కొన్నారు. అంతరిక్ష రహస్యాల పరిశోధకులకు ఈ యాత్ర విజయం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ఆమె పరిశోధనలు, ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శమని, మూడోసారి అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన స్త్రీ యొక్క సంకల్ప శక్తి, అంకితభావాన్నీ చూసి ప్రపంచమే గర్విస్తుందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యానానికి ఈ యాత్ర విజయం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఇద్దరు వ్యోమగాములు మరింత ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్షించారు.
Share this content:
Post Comment