హైదరాబాద్ నుండి అమలాపురం వెళుతున్న వెంకట రమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరం. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం తెల్లవారుజామున వెంకటరమణ ట్రావెల్స్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, కంట్రోల్ లో లేని డ్రైవింగ్ చేస్తూ, చొదిమెళ్ళ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో దాదాపు 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. నలుగురు మరణించారు. ఇంకా ఒకరిద్దరు సీరియస్ పరిస్థితుల్లో ఉన్నారని, ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యామని, వెంకటరమణ ట్రావెల్స్ యాజమాన్యం పైన సీరియస్గా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వ్యక్తులకు, గాయాల పాలైన వ్యక్తులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, పొలిమేర దాసు, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, జనసేన రవి, ఇద్దుం చిరంజీవి, పెరుమాళ్ళ జనార్థన్ రావు తదితరులు ఉన్నారు.
Share this content:
Post Comment