సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గం స్థానిక 19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో జనసేన పార్టీ నాయకులు వీరంకి పండు మరియు ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు పలు రకాల ఆటపోటీలను ఘనంగా నిర్వహించారు. ఇందులో కల్చర్ ప్రోగ్రాం (హరిదాసులు, గంగిరెద్దులు) లెమన్ & స్పూన్, మ్యూజికల్ చైర్, మహిళ సోదరి మణులకు ముగ్గుల పోటీలు రంగవల్లికలు, మగవాళ్ళకు రన్నింగ్, స్విమ్మింగ్, సో సైక్లింగ్ వంటి పలు రకాల ఆటపోటీలను ఘనంగా సంప్రదాయంగా నిర్వహించారు. ఈ పోటీల కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొనడం జరిగింది. శనివారం గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి కన్సిలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే కేవలం కోడిపందాలుకి జూదానికి పరిమితం అయిపోయింది. అటువంటి సమయంలో ఇలాంటి ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరానికి తెలిసేలాగా ఉండాలని అన్నారు. ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం ప్రతి సంవత్సరం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మన సాంప్రదాయాలను రక్షించాలని చెప్పి జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాపర్తి సూర్యనారాయణ, ములికి శ్రీను, స్థానిక నాయకులు రామారావు, సతీష్, శంకర్, త్రినాథ్, శీలం దుర్గారావు, అనిల్, సూరి, ప్రసాద్, చరణ్, సిహెచ్ రమేష్, ఎమ్ శేఖర్, జె సతీష్ తదితరులు పాల్గొన్నారు.