తెలుగు వారి నూతన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. ఏలూరులోని 34 వ డివిజన్ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, పవర్ పేటలోని శ్రీ సూర్య భగవానుడి దేవస్థానం, మరియు 39 వ డివిజన్ బాలయోగి వంతెన దగ్గర ఉన్న శ్రీశ్రీశ్రీ హనుమాన్ మరియు గండి పోచమ్మ అమ్మవార్ల దేవస్థానంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవన్నామస్మరణతో, షడ్రుచుల సమ్మేళనంతో నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతిస్తున్న నా బంధు మిత్ర సోదర సోదరీమణులకు, కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, జనసేనపార్టీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను, సంస్కృతి – సాంప్రదాయాలను అత్యంత ఆనంద సంబరంగా వేడుకలు చేసుకుంటున్న తెలుగు ప్రజలందరికీ, ఈ సంవత్సరం ఆయురారోగ్య సౌభాగ్య సంతోషాలతో నిండాలని సుఖసంతోషాలూ, అష్టైశ్వర్యాలూ ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నౌడూరు వాసు, శీర్ల వాసు, గంట రాంబాబు, యండమూరి దుర్గారావు, బూరాడ పూర్ణ, కోరాడ రెడ్డి, జనసేన నాయకులు బొత్స మధు, వినోద్, జనసేన రవి, ఇద్దుం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment