బాబాయ్ హత్య కేసును డైవర్ట్ చేసేందుకే రాజధాని అంశం: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: వివేకా హత్య కేసు డైవర్ట్ చేసేందుకే సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన చేశారని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఒక పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తులో నిజనిజాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో రాజధాని అంశాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ను తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. ఒకపక్క 1100 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటాన్ని సైతం పట్టించుకోకుండా రాజధాని విశాఖకు తరలించడానికి సిద్ధపడ్డారంటేనే విశాఖలో ఉన్న భూములపై మీ కన్ను పడిందని స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన భవనాల్లో ఉండకూడదు అని నిర్ణయించినప్పుడు రాష్ట్ర అసెంబ్లీ మరియు సెక్రటేరియట్ కార్యకలాపాలు చేయకూడదు. రోడ్లపై టెంట్లు వేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవాలి. అధికారం వచ్చిన మొదట్లోనే ప్రజా వేదికను కూల్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా కూల్చివేత తోనే మీ పరిపాలన సాగుతుంది. కనీసం రాష్ట్రంలో ఏ మూలన కూడా ఒక ప్రాజెక్టు గానీ భవనం గాని నిర్మాణం చేసినట్టు దాఖలాలు లేవు. ఇటువంటి సందర్భంలో రాజధాని మార్చడం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ నుండి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఉత్తరాంధ్ర పై ప్రేమ ఉంటే అక్కడ ఉన్న నాయకత్వాన్ని పెంపోందించి ఉత్తరాంధ్ర మీద దృష్టిసారించాలని, జనసేన పార్టీ నుండి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో తాడేపల్లిలో మీ భవనాన్ని నిర్మించుకుని అక్కడి నుండే పరిపాలన సాగిస్తానని ఏ విధంగా ప్రజలను మభ్య పెట్టావు. అదే పరిస్థితిలో ఈరోజు విశాఖ నుండి పరిపాలన చేస్తానని చెబితే నమ్మే ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఇకనైనా రాష్ట్రానికి కావలసిన అభివృద్ధిని మరియు నిరుద్యోగుల ఉపాధిని కల్పించేలాగా నీ పరిపాలన సాగాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ తేజ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు బోండా రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.