53వ నెంబర్ తీర్మానాన్ని రద్దు చేయాలి.. మున్సిపల్ కమిషనర్ కి జనసేన వినతి పత్రం

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రవేశపెట్టిన స్మశాన వాటికలో 5000 రూపాయల వసూలు 53 వ నెంబర్ తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏలూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రవేశపెట్టిన 53 వ నెంబర్ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు. అనంతరం నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 13 వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్మశాన వాటిక పై చేసిన 53వ తీర్మానం తక్షణమే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రజలు అధిక ధరలతో వివిధరకాల పన్నులతో సతమతమవుతుంటే కొత్తగా స్మశాన వాటికలో కాటికాపరి పేరుతో దహనసంస్కారాలకి ప్రతి బాడీ కి రూ.5000/-వేల రూపాయలను చెల్లించాలని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో తీర్మానం చేయటం సిగ్గు చేటని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఏలూరులో అధికార పార్టీ (వైసీపీ) ప్రతిపక్ష పార్టీ (టిడిపి) ఇద్దరు కూడా కుమ్మక్కై కౌన్సిల్ హాల్ లో జరిగిన సమావేశంలో ఏక నిర్ణయాల మీద ఈ తీర్మానం ఆమోదించడం జరిగిందన్నారు. బయట ప్రజలకు మాత్రమే అధికారపక్ష ప్రతిపక్ష పార్టీలు కానీ లోపల మీరిద్దరు కూడా ఒక్కటేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు విలీన 7 గ్రామాలలో ఉన్న 17 స్మశాన వాటికలలో కాటికాపరులకు ప్రభుత్వం ద్వారా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించాలని, తరతరాలుగా కాటికాపరులుగా స్మశాన వాటికలలో దహనసంస్కారాలు చేస్తునట్టువంటి వారిని మున్సిపల్ వర్కర్ గా గుర్తించాలని అన్నారు. అంతేగాని ప్రజలని ప్రతి బాడీకి రూ.5000 రూపాయలు చెల్లించాలనే తీర్మానం చేయటం నీచమైన చర్య. మీరు వెంటనే ఈ 53 వ నెంబర్ తీర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షుడు నగి రెడ్డి, కాశి నరేష్ ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, గుబ్బల నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, దోసపర్తి రాజు, రాము నాయుడు, గడ్డం చైతన్య, పవన్ కుమార్, సురేష్, బుధ్ధ నాగేశ్వరరావు, వీర మహిళలు గన్నవరపు ప్రియా రాణి, జిల్లెల ప్రియాంక, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.