రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

  • ఏలూరుకు చెందిన ప్రముఖులు రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన పార్టీలోకి చేరికలు

ఏలూరు: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి ఏలూరుకు చెందిన ప్రముఖులు మంగళవారం రెడ్డి అప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో తెనాలి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. పీ.ఏ.సీ.చైర్మెన్ నాదెండ్ల మనోహర్ వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వీరికి రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అని దశ నిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రెడ్డి అప్పల నాయుడు సూచించారు. రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురవేయడం కోసం కావలసిన ప్రణాలికను రచించడం కోసం వ్యూహాత్మకంగా ఈరోజున ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు. జాయిన్ అయిన వారిలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ సోషల్ జస్టిస్ కంభంపాటి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎంప్లయ్ దొడ్డిపట్ల పుల్లారావు, రిటైర్డ్ బి.ఎస్.ఎన్.ఎల్ ఎంప్లయ్ మరియు వెల్ ఆఫ్ కైండ్ నెస్ సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు పొనుగంటి వెంకట రమణ, రిటైర్డ్ ఎస్.ఐ సయాన దాశరథి, రిటైర్డ్ ఎం.ఆర్.ఓ కమ్ముల చంద్రశేఖర్, రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కీ చెందిన వెన్నవల్లి రామచంద్రరావు, బిజినెస్ మాన్ తట్టా గంగాధర్, కర్రె రామాంజనేయులు, మద్దుల రమణ కుమార్, పదార్థి వినయ్, యర్రంశెట్టి భవానీ, సీర్ల పార్థసారథి, మోతేపల్లి ఉమామహేశ్వరరావు, లక్ష్మణ్ కుమార్, గ్రంథి బంథారి, రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లయ్ రాజనాల బహుదుర్, సాఫ్ట్వేర్ ఎన్ ఆర్ ఐ రేవూరి భరత్, ఆర్.టి.ఓ. ఏజెంట్ కంచదా విజయ్, సోషల్ వర్కర్ యర్రంశెట్టి నాగమణి, లాయర్ పదార్థి రామచంద్రరావు తదితరులు పార్టీలో చేరారు. అనంతరం రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాలకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు సైతం దక్కకుండా వైసిపిని ఓడిస్తేనే భవిష్యత్తులో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ సాహసించరని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడానికి జగన్ రెడ్డి మరోసారి కుట్రలు పన్నుతున్నారని ఐతే ఈసారి మోసపోవడానికి జనం సిధ్ధంగా లేరనే విషయాన్ని గుర్తించాలని స్పష్టంగా తెలియజేశారు. ఏలూరులో జనసేన పార్టీ తరపున అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల నిర్వహణ కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నాయకులు జక్కాలక్ష్మిమోహన్ రావు, వీరంకి పండు, సరిది రాజేష్, దోసపర్తి రాజు, కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, అల్లు చరణ్, జనసేన రవి, పైడి లక్ష్మణరావు, బోండా రాము నాయుడు, నూకల సాయి ప్రసాద్, కరీమ్ తదితరులు పాల్గొన్నారు.