పర్సనల్ లోన్ పై తగ్గిన వడ్డీ రేట్లు

ఈ కరోనా కాలంలో వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకునే వారికి శుభవార్త. ఒకప్పుడు 14-20 శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా తగ్గాయి. 8.35 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం బ్యాంకులు కల్పిస్తున్నాయి. వేర్వేరు బ్యాంకులు, కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌ ఆధారంగా వడ్డీరేట్లు అమలు చేస్తున్నాయి. వివిధ బ్యాంకులు అమలు చేస్తున్నవడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 9.60%-15.65%

కెనరాబ్యాంక్- 8.50%-13.90%

సెంట్రల్ బ్యాంక్- 8.35%-10.20%

పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.80%-11.65%

బ్యాంక్ ఆఫ్ బరోడా- 10.10%-15.10%

ఐడీబీఐ బ్యాంక్- 8.90%-13.59%

ఇండియన్ బ్యాంక్- 9.20%-13.65%

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.60%-12.05%

యూనియన్ బ్యాంక్- 9.30%-13.40%

మీ క్రెడిట్ స్కోర్ 750 నుంచి 800 మధ్య ఉంటే తక్కువ వడ్డీకే మీరు వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. బ్యాంకులు సైతం అలాంటి కస్టమర్లను గుర్తించి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.