క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోండి.. పులి మల్లికార్జున రావు

కందుకూరు నియోజకవర్గం : జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన అదినేత పార్టీ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు కోసం ప్రతిష్తాత్మకంగా తీసుకువచ్చిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంద్వారా సభ్యత్వాన్ని చేయించుకున్న ప్రతి కార్యకర్తకి బరోసా కల్పించడానికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5లక్షల భీమా చెక్కు, ప్రమాదంలో గాయపడిటే 50 వేలు హాస్పిటల్ ఖర్చులు పార్టీ నుంచి సహాయం చేసేలా చూస్తారని కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ పులి మల్లికార్జున రావు తెలియజేశారు. క్రియా శీలక సభ్యత్వ కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 28వ తేదీ వరకూ కొనసాగుతుందని, సభ్యత్వం కావలసిన వారు జనసేన పార్టీ గుడ్లూరు ఆఫీసు నందు వాలంటీర్లగా నియమితులైన వారిని కలసి సభ్యత్వ నమోదు కోసం ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, నామిని ఆధార్, 500 సభ్యత్వ రుసుము, పర్మినెంట్ ఫోన్ నెంబర్ తో జనసేన పార్టీ ఆఫీసు నందు సంప్రదించగలరని పులి మల్లికార్జున రావు తెలిపారు.