నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 58 ఎన్.ఎస్.ఎస్ యూనిట్లకు ఏ.కే.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు గురువారం లాంఛనంగా నిధులను విడుదల చేశారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో మొత్తం 224 కళాశాలల ఉండగా, ఉమ్మడి ప్రకాశం జిల్లా గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బదిలీ కాబడిన 58 యూనిట్లకు మాత్రమే నిధులు మంజూరు అయ్యాయి. ఒక్కో యూనిట్ కు రూ. 19,000 చొప్పున మొత్తం రూ. 11,02,000 మంజూరు కాగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ గుర్తింపుతో ఉన్న కళాశాలల్లో ఎన్.ఎస్.ఎస్ యూనిట్లు గల కళాశాలల ఖాతాలకు నేరుగా డబ్బులను జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ నిధులు మంజూరు అయిన కళాశాలల ప్రిన్సిపాల్, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆఫీసర్స్ సంయుక్తంగా ఒక ప్లాన్ ప్రకారం నిధులను వినియోగించుకొని వివరాలను అందజేయాలని పేర్కొన్నారు. ఎన్.ఎస్.ఎస్. క్యాంపులను ఏర్పాటు చేసి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పారిశుధ్య పనుల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధి లోగల ఎస్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లకు సూచించారు. మిగిలిన నిధులు ఏప్రిల్ నెలాఖరు నాటికి విడుదల అవుతాయని ఆయన అన్నారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి నూతనంగా మరో 58 ఎన్.ఎస్.ఎస్ యూనిట్లు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అవి మంజూరు కాగానే వెంటనే కళాశాలకు కేతాయించడం జరుగుతుందని డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏ.కే.యూ సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment