ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, శాంతినగర్, కవులూరు ప్రాంతాల్లో ఇటీవల వరదలకు బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని, అనంతరం వెలగలేరు రెగ్యులేటర్ ను జిల్లా కలెక్టర్ లక్ష్మి షా, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధీ) శుక్రవారం పరిశీలించడం జరిగింది. అనంతరం రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. బుడమేరు కరకట్ట పటిష్టతకు సంబందిత శాఖల అధికారులకు లక్ష్మీ షా సూచనలివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపల్లి, కవులూరు, వెలగలేరు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment